
Hemachandra Sravana Bhargavi Divorce News Viral In Social Media: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల మాట ఎలా ఉన్నా విడాకుల వార్తలు మాత్రం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. సినీ సెలబ్రిటీలు తమ భాగస్వామికి డివోర్స్‌తో వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ మరో కొత్త దాంపత్య జీవితానికి తెర లేపుతున్నారు. కొందరైతే ఎంతో మధురంగా రాసుకున్న తమ పెళ్లి పుస్తకాన్ని చింపేసి సోలో లైఫే సో బెటర్ అంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో క్యూట్ పేయిర్ అయిన నాగ చైతన్య, సమంత విడాకులతో తెగదెంపులు చేసుకున్న విషయం ఇప్పటికీ అనేకమందికి మింగుడుపడటం లేదు. తాజాగా మరో జంట డివోర్స్ తీసుకునేందుకు రెడీ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త గింగిరాలు తిరుగుతోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనీ గాయకులుగా శ్రావణ బార్గవి, హేమచంద్ర చాలా ఫేమస్ అయ్యారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా హేమచంద్ర చాలా పాపులర్. శ్రావణ భార్గవి, హేమచంద్ర ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి పీటలు ఎక్కారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు ప్రేమకు గుర్తుగా 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. ఎంతో హాయిగా సాగుతున్న వీరి జీవితంలో ఏం జరిగిందో తెలియదు గానీ, వీరు తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు గత కొద్దిరోజులుగా కథనాలు వెలువడుతున్నాయి.
(చదవండి: 'నువ్వే కావాలి' హీరోకు నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు)
(చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..)
ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు రచ్చ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే హేమచంద్ర ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ డివోర్స్ వార్తలు నిజమే అన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఏకంగా హేమచంద్ర, శ్రావణ భార్గవి సోషల్ మీడియా అకౌంట్స్‌లోని వారి పోస్టులకు కామెంట్స్ రూపంలో ప్రశ్నిస్తున్నారు. ఇటు హేమచంద్ర, అటు శ్రావణ భార్గవి తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లలో స్టోరీస్, పోస్టులు పెడుతున్నారే తప్ప ఈ కామెంట్లకు స్పందించకపోవడం గమనార్హం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని తెలుస్తోంది.
(చదవండి: నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment