
Samantha Becomes Most Popular Telugu Actress: సమంత-నాగ చైతన్య విడిపోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఇప్పుడు చై-సామ్ విడాకుల గురించి చర్చించుకుంటున్నారు. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారు? మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట బ్రేకప్ చెప్పుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక విడాకుల అనంతరం సోషల్ మీడియాలో సమంత పేరు మార్మోగిపోతుంది. చదవండి: విడాకుల ఎఫెక్ట్: షూటింగ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత
ముందు నుంచి సమంతకు సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంది. అయితే కొంతకాలంగా చైతూతో విడాకుల నేపథ్యంలో సామ్ పేరు మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా అకౌంట్లలో అక్కినేని పేరు తొలగించినప్పటి నుంచి సామ్-చైతూ మధ్య ఏదో జరిగిందన్న వార్తలు ఊపందుకున్నాయి. దీంతో ఆమె సోషల్ అకౌంట్లపై నెటిజన్లు మరింత ఫోకస్ పెట్టారు. విడాకుల తర్వాత సామ్ ఫాలోవర్లు కూడా పెరిగారు.
సౌత్ హీరోయిన్స్‌లలో మొన్నటివరకు కాజల్ సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉండేది. ఇప్పుడు సమంత కాజల్‌ను వెనక్కు నెట్టి నెంబర్1 స్థానంలోకి వచ్చింది. ఆర్మాక్స్ మీడియా జరిపిన సర్వే ప్రకారం సోషల్‌మీడియా మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా సమంత నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కాజల్, అనుష్క శెట్టి ఉన్నారు. చదవండి: చై-సామ్ కాపురంలో చిచ్చు: 'అక్కా అని పిలిచే వ్యక్తితో'..
1. సమంత
2. కాజల్ అగర్వాల్
3. అనుష్క శెట్టి
4. రష్మిక మందన్న
5. తమన్న భాటియా
6. కీర్తి సురేష్
7. పూజా హెగ్డే
8. రకుల్ ప్రీత్ సింగ్
9. రాశీ ఖన్నా
10. సాయి పల్లవి
Comments
Please login to add a commentAdd a comment