కుమారీ ఆంటీ ఒకప్పుడు ఆ సింగర్‌ ఇంట్లో పని చేసింది! | Hyderabad Famous Street Food Owner Kumari Aunty Worked In This Tollywood Singer Home | Sakshi
Sakshi News home page

Kumari Aunty: ఆ సింగర్‌ ఇంట్లో పని చేశా.. తర్వాతే ఈ బిజినెస్‌... సందీప్‌ కిషన్‌ ఎంతిచ్చాడంటే?

Published Mon, Feb 5 2024 12:44 PM | Last Updated on Mon, Feb 5 2024 1:30 PM

Hyderabad Famous Street Food Owner Kumari Aunty Worked In This Tollywood Singer Home - Sakshi

కుమారి ఆంటీ.. సోషల్‌ మీడియాలో ఇప్పుడీవిడే ట్రెండింగ్‌. నాన్నా, బుజ్జి, కన్నా అంటూ ప్రేమగా భోజనం వడ్డిస్తుందీ ఆంటీ. అందుకే ఆమె ఫుడ్‌ స్టాల్‌కు అంత గిరాకీ! దీంతో యూట్యూబర్లు ఎగబడ్డారు, వీడియోలు తీశారు. ఆమెను మరింత ఫేమస్‌ చేశారు. దీంతో ఎక్కడెక్కడినుంచో జనాలు ఆమె చేతివంట తినేందుకు క్యూ కడుతున్నారు. అటు సోషల్‌ మీడియాలోనూ ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి.

సింగర్‌ ఇంట్లో పని చేసిన కుమారి ఆంటీ
అయితే ఇలా చిన్నపాటి హోటల్‌ పెట్టడానికి ముందు టాలీవుడ్‌ సింగర్‌ హేమచంద్ర ఇంట్లో పని చేసిందట! ఈ విషయాన్ని కుమారీ ఆంటీ స్వయంగా వెల్లడించింది. '2009లో హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడు దుస్తులు కుట్టేదాన్ని. అలాగే గాయకుడు హేమచంద్ర ఇంట్లో వంటలు చేయడానికి వెళ్లేదాన్ని. ఇలా చాలా పనులు చేశాను. హేమచంద్ర తల్లి చాలా బాగా చూసుకునేది. అమాయకురాలిగా ఉన్నావు, ఇలాగైతే ఎలా బతుకుతావు? అనేవారు. మా అమ్మానాన్నలాగా ప్రేమగా చూసుకునేవారు. మాకు ఏదైనా తెలియకపోతే వాళ్లే ఇలా చేయాలి, అలా చేయాలని సలహాలు ఇచ్చేవారు. చాలా మంచివారు.

సందీప్‌ కిషన్‌ ఎంతిచ్చాడంటే?
ఇకపోతే 2011లో రోడ్డు పక్కన భోజనం అమ్మడం ప్రారంభించాం. మొదటి నుంచీ సీరియల్‌, సినిమా సెలబ్రిటీలు నా దగ్గర ఫుడ్‌ తీసుకెళ్లేవాళ్లు. జూనియర్‌ ఎన్టీఆర్‌, అలీ.. కూరలు పట్టుకువెళ్లేవాళ్లు. ఈ మధ్య సందీప్‌ కిషన్‌ వచ్చి నా చేతి వంట రుచి చూశాడు. తిన్న తర్వాత రూ.10 వేలు నా చేతిలో పెట్టాడు' అని చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ. బిగ్‌బాస్‌ ఆఫర్‌ గురించి మాట్లాడుతూ అక్కడ వంటలు చేస్తారా? ఒకవేళ నన్ను రమ్మంటే వెళ్లి వంటలు చేయాలా? అని అమాయకంగా అడిగింది. అసలు తాను బిగ్‌బాస్‌ షో చూడనని, అలాంటి ఆఫర్‌ ఏదీ రాలేదని పరోక్షంగా బదులిచ్చింది.

చదవండి: ఫ్రీగా వెడ్డింగ్‌ డ్రెస్సులు కావాలా? నువ్వో పెద్ద సెలబ్రిటీ మరి! నటిపై ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement