Thaman Gets Trolled Over Bheemla Nayak Movie First Glimpse - Sakshi
Sakshi News home page

Bheemla Nayak: తమన్‌.. ఎన్నిసార్లు మోసం చేస్తావంటూ ట్రోల్స్‌!

Published Sun, Aug 15 2021 2:36 PM | Last Updated on Mon, Aug 16 2021 2:09 PM

Thaman Gets Trolled Over Bheemla Nayak Movie First Glimpse - Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా పవన్‌ కల్యాణ్‌-రానా దగ్గుబాటిల మల్టిస్టార్‌ సినిమాకు ‘భీమ్లా నాయక్‌’గా టైటిల్‌ ఖారారు చేసి ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. ఈ వీడియో​కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌లో పవన్‌ లుక్‌, ఆయన డైలాగ్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. పవన్‌ రౌడీలను కొడుతుంటే బ్యాగ్రౌండ్‌లో వస్తున్న మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. ఇక అంతబాగానే ఉందనుకుంటే ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైన కాసేపటికే నెటిజన్లు మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.

మరోసారి తమన్‌ మ్యూజిక్‌ను కాపీ కొట్టాడంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులోని ఓ బిట్‌ దగ్గర ‘పెట్టా’ మూవీలోని ఓ పాట మ్యూజిక్‌ను పోలి ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అంటే ‘ఈ సారి కూడా తమన్‌ కాపీ కొట్టాడు.. ఇలా ఎన్నిసార్లు మోసం చేస్తావు తమన్‌’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తమన్‌ ఇలా ట్రోల్స్‌ బారిన పడటం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా ‘వి’ మూవీ సమయంలో మ్యూజిక్‌​  కాపీ కొట్టాడంటూ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే వాటిపై తమన్‌ స్పందించకపోవడం గమనార్హం.

కాగా, ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నాడు. ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ అనే మలయాళ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అక్కడ సూపర్‌ హిట్‌ సాధించిన ఈ మూవీలో  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బీజుమేనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. బీజుమేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌, పృథ్వీరాజ్‌కుమార్‌ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇక నిత్యామీనన్‌, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement