ఒక్క ట్వీట్‌తో పుకార్లకు పుల్‌స్టాప్‌ పెట్టాడు | Amid Rumours Anirudh Wishes to NTR Trivikram Team | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 5 2018 5:59 PM | Last Updated on Mon, Mar 5 2018 5:59 PM

Amid Rumours Anirudh Wishes to NTR Trivikram Team - Sakshi

అనిరుధ్‌.. థమన్‌ (ఫైల్‌ ఫోటోలు)

సాక్షి, సినిమా : ఎన్టీఆర్‌తో తీయబోయే చిత్రం కోసం ముందుగా కోలీవుడ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యాంగా అతన్ని తప్పించటంతో ఆ స్థానంలో థమన్‌ వచ్చి చేరాడు. అజ్ఞాతవాసితో అనిరుధ్‌ నిరుత్సాహపరిచాడని.. అందుకే త్రివిక్రమ్‌ అతన్ని తప్పించడంటూ టాక్‌ వినిపించింది. 

ఇక కోలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న తనను అంత దారుణంగా తీసేయటంతో అనిరుధ్‌ హర్టయ్యాడని.. ఇకపై త్రివిక్రమ్‌తో పని చేయకూడదని, అంతెందుకు అసలు తెలుగు ప్రాజెక్టులే ఓకే చేయకూడదని నిర్ణయించుకున్నాడంటూ  రకరకాల కథనాలు వెలువడ్డాయి. కానీ, ఇప్పుడు వాటన్నింటిని పటాపంచల్‌ చేస్తూ చిత్ర యూనిట్‌కు అనిరుధ్‌ విషెస్‌ చెప్పేశాడు‌. 

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రం కోసం హీరోయిన్‌గా పూజాహెగ్డేను తీసుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారికా &హాసిని క్రియేషన్స్‌ వాళ్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురూజీ, తారక్‌, థమన్‌, చిత్ర నిర్మాతలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.. చిత్రం ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ అనిరుధ్‌ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement