
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'వెంకీ మామ'. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జైలవకుశ సినిమాల దర్శకుడు కే ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌లు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. తాజాగా ‘వెంకీ మామ’టైటిల్ సాంగ్‌ను తాజాగా చిత్రబృందం రిలీజ్ చేసింది. మామాఅల్లుళ్ల రిలేషన్ షిప్‌ను తెలియజేస్తూ సాగే పాట హృదయాలను హత్తుకునేలా ఉంది.
‘ద్రాక్షారామం జంగమయ్య బీమలింగమయ్య బిడ్డల కాచుకోవయ్య’అంటూ సాగే పాటను శ్రీకృష్ణ, మోహన బోగరాజు ఆలపించారు. రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ హృదయాలను టచ్ చేసేలా ఉన్నాయి. పాట మధ్యలో వచ్చే ‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా.. నా ధైర్యం నా స్థైర్యం నువ్వేలే వెంకీమామా’అంటూ వచ్చే లిరిక్స్ ఆకట్టుకుంది. మంచి జోష్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మరోసారి తన మ్యాజిక్ ఈ సాంగ్‌లో చూపించాడు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను ముఖ్యంగా మామాఅల్లుళ్లకు తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాట వింటుంటే తమ మేనమామలు గుర్తుకువస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వెంకీ, నాగచైతన్య సరసన రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment