తిట్టేవారు కూడా కావాలి | Venkimama Movie Is A Good Emotional Subject Says Thaman | Sakshi
Sakshi News home page

తిట్టేవారు కూడా కావాలి

Dec 4 2019 12:09 AM | Updated on Dec 4 2019 12:09 AM

Venkimama Movie Is A Good Emotional Subject Says Thaman - Sakshi

‘‘పొగడ్తలు ఉన్న చోటే విమర్శలు కూడా ఉంటాయి. విమర్శలను విశ్లేషించుకుంటూ ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ కెరీర్లో ముందుకు సాగిపోవాలనుకుంటున్నాను’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్‌. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ చెప్పిన విశేషాలు.

►‘వెంకీమామ’ ఒక ఎమోషనల్‌ ఫిల్మ్‌. ఈ సినిమా రఫ్‌ వెర్షన్‌ చూసి నేను కంటతడి పెట్టుకున్నాను. ఇందులోని ఎమోషన్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతుందని అనుకుంటున్నాను. మామా? అల్లుడా? అన్నట్లు వెంకటేష్, నాగచైతన్య ఇద్దరూ పోటీపడి నటించారు. ఫస్ట్‌హాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా, సెకండాఫ్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. వెంకటేష్‌గారి డ్యాన్స్‌ సినిమాలో హైలైట్‌. డైరెక్టర్‌ బాబీ బాగా తెరకెక్కించాడు.

►‘సరైనోడు’ సినిమా తర్వాత బ్రేక్‌ తీసుకుని బాగా రిలాక్స్‌ అయ్యాను. ఆ తర్వాత చేసిన ‘మహానుభావుడు, భాగమతి, తొలిప్రేమ, ఛల్‌ మోహన్‌రంగ, అరవిందసమేత వీరరాఘవ’ సినిమాల పాటలకు మంచి పేరు వచ్చింది. నా పాటలకు మంచి స్పందన లభిస్తోందంటే అందుకు కారణం కథలు బాగుండటమే.

►సోషల్‌ మీడియా కామెంట్స్‌ను పట్టించుకుంటాను. ప్రతి ట్వీట్‌ ఓ ప్రెస్‌మీటే (నవ్వుతూ). ఓ నెటిజన్‌ వ్యతిరేకంగా ఓ ట్వీట్‌ పోస్ట్‌ చేశాడు? అంటే అతనెక్కడో బాధపడి ఉంటాడు. అది గమనించి నెక్ట్స్‌ టైమ్‌ అలా చేయకుండా ఉండాలనుకుంటాను. అలా తిట్టేవారు కూడా కావాలి. ఎందుకంటే అమ్మ తిట్టకపోతే ఎలా బాగుపడతాం.

►ప్రస్తుతానికి రీమిక్స్‌ సాంగ్‌కు కాస్త దూరంగా ఉందామనుకుంటున్నాను. ఇప్పుడు సినిమాలోని ఆరు పాటలను ఒకేసారి కాకుండా విడివిడిగా విడుదల చేయడం మంచి పరిణామమే అని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్లు ఉంటున్నాయి. సావన్, రాగ.. ఇలా డిఫరెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. అందువలన ఆడియన్స్‌కు మరింత చేరువ అయ్యే చాన్స్‌ ఉంటుంది.

►‘వెంకీమామ’ ఫ్యామిలీ డ్రామా, ‘అల.. వైకుంఠపురములో..’ ఫన్‌ అండ్‌ యాక్షన్‌ ఫిల్మ్, ‘డిస్కో రాజా’ డిఫరెంట్‌ జానర్, ‘ప్రతిరోజూ పండగే’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. ఇలా భిన్న రకాల సినిమాలకు సంగీతం సమకూర్చడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement