
కార్యక్రమంలో సంగీత దర్శకుడు థమన్
సాక్షి,రామంతాపూర్: సంయమనం, ఓర్పుతో సాదించలేనిది ఏది లేదని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ అన్నారు. రామంతాపూర్ అరోరా పీజీ కళాశాలలో మేనేజ్‌మెంట్ అన్వేషణ –2018 ఆదివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రంగంలో మేనేజ్‌మెంట్ అనేది ఉంటుందని, మేనేజ్‌మెంట్ విద్యార్థులు సంయమనంతో వ్యవహరించి విషయాన్ని అర్థం చేసుకొని సమస్యను సులువుగా పరిష్కరించాలన్నారు.
మేనేజ్‌మెంట్ విద్యార్థుల నడవడిక, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఉన్నత స్థితికి తీసుకెళతాయన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.మాధవి, సినీ గాయకుడు కృష్ణ, ఆర్‌జే సూరిపాల్గొన్నారు.