RC15 Update: Ram Charan-Shankar Film Launched, Poster Goes Viral - Sakshi
Sakshi News home page

RC15:అదిరిపోయిన రామ్ చరణ్-శంకర్ ఫస్ట్‌ పోస్టర్‌

Published Wed, Sep 8 2021 11:48 AM | Last Updated on Wed, Sep 8 2021 4:04 PM

Ram Charan-Shankars RC 15 Launch: Makers Share Poster - Sakshi

Ram Charan-Shankars RC 15 Launch: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో బుధవారం ఉదయం పూజా కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌నుఎ రిలీజ్‌ చేసింది. ఇందులో రామ్‌చరణ్‌,కియారాలతో పాటు  డైరెక్టర్‌శంకర్‌, దిల్‌ రాజు, సునీల్‌ సహా ఇతర టెక్నీషియన్లు అందరూ సూటుబూటు వేసుకొని ఫైల్స్‌ పట్టుకొని దర్శనమిచ్చారు. ఈ క్రేజీ పోస్టర్‌కు వీ ఆర్‌ కమింగ్‌ అంటూ క్యాప్షన్‌ను జోడించారు.

రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు  నిర్మిస్తున్నారు. శిరీష్ దీనికి సహ నిర్మాత.అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి : డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందుకు రానా దగ్గుబాటి
బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఇంట తీవ్ర విషాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement