
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ మూవీ రూపొందనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు ఇప్పటికే రూ. 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు తాజా అప్‌డేట్ మరింత ఆసక్తిని పెంచుతోంది.
మొదట ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్‌ను ఎంపిక చేసినట్టు గతంలో ప్రచారం జరగగా.. ఆ తర్వాత లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ పేరు వినిపినించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సంగీత తరంగం ఎస్‌ఎస్ తమన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఆయనను ఎంపిక చేశారని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంటు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పొలిటికల్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ స్ర్కీప్ట్ కూడా రెడీ అయిపోయింది.
దీంతో ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరలో పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్‌కు ‘ఇండియన్ 2’ నిర్మాతలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ తమ సినిమాను పూర్తి చేయకుండానే చరణ్‌తో మరో సినిమాకు రెడీ అయ్యారంటూ లైకా ప్రొడక్షన్ కోర్టును ఆశ్రయించింది. అయితే మద్రాసు హైకోర్టు శంకర్కు ఊరటనిచ్చింది. ఇతర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించకుండా స్టే విధించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ తాజా అప్‌డేట్‌ను చూసి తన డ్యాన్స్‌తో ఇరగదీసే చరణ్.. తమన్ పాటలకు స్టెప్పులేస్తే ఇంకా అదిరిపోతుంది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment