చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌ పాట | Allu Arjun Samajavaragamana Song Becomes The Most Liked Telugu Song | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌ పాట

Published Sat, Oct 19 2019 5:50 PM | Last Updated on Sat, Oct 19 2019 5:51 PM

Allu Arjun Samajavaragamana Song Becomes The Most Liked Telugu Song - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం నటిస్తున్న 'అల..వైకుంఠపురములో' చిత్రంలోని సామజవరగమనా.. అనే పాట ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఆ పాట యూట్యూబ్‌లో సంచలనాలు రేపుతుంది. ఇప్పటి వరకు 41 మిలియన్ల వ్యూస్‌ ఈ పాట సొంతం చేసుకుంది. అలాగే 7 లక్షల లైక్స్ ను కూడా యూట్యూబ్ లో దక్కించుకుంది. అత్యధిక యూట్యూబ్ లైక్స్ ను దక్కించుకున్న తెలుగు పాటగా సామజవరగమనా నిలిచింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించాడు. ‘అత్యధికులు లైక్‌ చేసిన తెలుగు పాట. మీ ప్రేమకు థ్యాంక్స్‌’  అని బన్ని ట్వీట్‌ చేశారు. 

 త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను  సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది  జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement