S Thaman Vs Anirudh: Music Director Anirudh Put Full Focus On Tollywood - Sakshi
Sakshi News home page

Anirudh: టాలీవుడ్ పై అనిరుథ్ ఫోకస్..పెరుగుతున్న కొత్త సినిమాల కౌంట్!

Jun 5 2022 12:25 PM | Updated on Jun 5 2022 1:53 PM

Music Director Anirudh Put Full Focus On Tollywood - Sakshi

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు తమన్‌. ఆయన ట్యూన్ కడితే ఆ మూవీ హిట్టే అనే విధంగా సెంటిమెంట్ స్టార్ట్ అయిపోయింది. తనదైన కంపోజీషన్స్ తో భీమ్లానాయక్, సర్కారు వారి పాట లాంటి చిత్రాలకు బంపర్ ఓపెనింగ్స్ అందించాడు. మూవీ సక్సెస్ లో తన మ్యూజిక్  కు స్పెసిఫిక్ రోల్ ఉందంటూ ప్రూవ్ చేశాడు. 

సేమ్ టు సేమ్ సీన్ను కోలీవుడ్ లో రిపీట్ చేసాడు అనిరుథ్. అక్కడ ఈ ఏడాది విడుదలైన ఘన విజయాలను అందుకున్న చిత్రాల్లో అనిరుథ్ సంగీత దర్శకత్వం వహించినవే ఎక్కువ. ఏప్రిల్ 13న రిలీజైన బీస్ట్ తో అనిరుథ్ హంగామా మొదలైంది. ఆ తర్వాత కన్మణి రాంబో కతీజా, రీసెంట్ గా డాన్, ఇప్పుడు విక్రమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న తమన్ స్పీడ్ కు అనిరుథ్ బ్రేక్స్ వేస్తున్నాడు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు అనిరుథ్. ఇప్పుడు మరో ఆర్ ఆర్ ఆర్ హీరో రామ్ చరణ్ నటించబోయే న్యూ ఫిల్మ్ కు సంగీతం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో చరణ్ ఒక చిత్రం చేయాల్సి ఉంది. శంకర్ తో మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ నటించబోయే మూవీ ఇది. ఈ సినిమాకు అనిరుథ్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌ సెలెక్ట్‌  చేశారట. గౌతమ్, అనిరుథ్ గతంలో జెర్సీ కోసం కలసి పని చేశారు. ఆ రిలేషన్‌తోనే ఇప్పుడు చరణ్ మూవీకి సంగీతం అందించే అవకాశం వచ్చిందట. ఇదే నిజమైతే.. టాలీవుడ్‌లోనూ అనిరుథ్‌ హంగామా మొదలైనట్లే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement