తమిళనాడులోని కోవిల్‌పట్టికి చెందిన ఓ విద్యార్థి కుటుంబానికి దళపతి విజయ్ సాయం చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆ విద్యార్థి తన కుటుంబ పరిస్థితుల కారణంగా కాలేజీకి వెళ్తూనే.. కూలి పని కూడా చేస్తున్నట్లు చెప్పాడు. ఆ వీడియో కాస్త హీరో విజయ్ వరకు చేరింది. దీంతో ఆ విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చుల కోసం వెంటనే రూ. 25వేలు అందించారు. ఆ విద్యార్థి చదువు విషయంలో పూర్తి బాధ్యత తనే తీసుకుంటున్నట్లు తెలిపారు.
టీవీ ఛానల్‌లో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. మార్కెట్ యార్డ్‌లో మూటలు మోస్తూ చదువుకుంటున్నట్లు చెప్పాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే తాను చదవుకుంటూ ఈ పని చేస్తున్నట్లు చెప్పాడు. మూటలు మోయడం వల్ల తన భుజం నొప్పిగా ఉంటుందని వాపోయాడు. అయినా, తన అమ్మకు ఆసరా కల్పించేందుకే ఆ నొప్పిని భరిస్తూ మూటలు మోస్తున్నానని చెప్పాడు. కానీ తాను నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు ఆమ్మతో చెప్పలేదని తెలిపాడు. అలా రోజుకు కనీసం 5 గంటలు పని చేస్తానని చెప్పిన ఆ విద్యార్థి కొన్ని సార్లు రాత్రి బస్సు లేకుంటే సుమారు 3 కీ.మీ నడుస్తానని తెలిపాడు.
విజయ్ ఈ విద్యార్థి కుటుంబానికి తవేక ఆలయ నిర్వాహకుల ద్వారా సహాయం చేశారు. ఈ వీడియోలో విద్యార్థి తల్లి మాట్లాడుతూ.. ' నా కుమారుడి మాటలకు చలించిపోయిన విజయ్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మా అబ్బాయి కాలేజీ చదువుకు అయ్యే పూర్తి ఖర్చును ఆయన భరిస్తానని చెప్పారు. ప్రస్తుతం కాలేజీలో చెల్లించమని రూ. 25 వేలు ఇచ్చారు. అంతేకాకుండా మా కుటుంబానికి ఒక నెల సరిపడ ఇంటి వస్తువులను కూడా విజయ్ అందించారు. అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియదు.' అని విద్యార్థి తల్లి పేర్కొంది. అదేవిధంగా స్కూల్ విద్యార్థి వీడియో చూసిన ప్రముఖ సంగీత దర్శకులు థమన్ కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ విద్యార్థికి మోటార్ బైక్ కొనిస్తానని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు.
Well done @tvkvijayhq @actorvijay . That was very quick 👏💐
pic.twitter.com/cSIsNJqY4m— Rajasekar (@sekartweets) August 26, 2024
I want to help with a Two Wheeler 🛵 which will make him reach his Beloved Mother fast as possible as this guy wants his mother to be happy and prosperous in life ❤️🥹
Get me details guys let’s help this boy 🛵❤️ https://t.co/TgbC2q98AU— thaman S (@MusicThaman) August 25, 2024
Comments
Please login to add a commentAdd a comment