
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ బాబు మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. సంక్రాంతికి బరిలోకి దిగాల్సిన ‘సర్కారు వారి పాట’ పోస్ట్ పోన్ అయింది. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు.అయితే మరో నాలుగు రోజులు ఒపిక పట్టమంటోంది ఈ సినిమా యూనిట్. సంక్రాంతి నుంచి సర్కారు వారి అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కికి కావడం అంటోంది యూనిట్. సంక్రాంతి పండగ కానుకగా సినిమాను రిలీజ్ చేయలేకపోయింది యూనిట్.
అందుకే పండక్కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలనుకుంటోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సాంగ్స్ కంపోజీషన్ కంప్లీట్ చేసాడు తమన్. సాంగ్స్ అన్ని నెక్ట్స్ లెవల్లో ఉంటాయని, సర్కారు వారి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించడం ఖాయమని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తమన్.గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మూవీ షూటింగ్ కు సంబంధించిన మరో షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. త్వరలో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి,మూవీని ఏప్రిల్ 1కి రిలీజ్ కు రెడీ చేయనుంది యూనిట్. మహేశ్‌కు జోడిగా కీర్తి సురేష్ కనిపిస్తోంది. సముద్రఖని విలన్ రోల్ చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment