
స్థిరాస్తుల లావాదేవీలపై కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: స్థిరాస్తి లావాదేవీల విలువ రూ.50 లక్షలు మించితే ఒక శాతం టీడీఎస్ మినహాయింపు నిబంధన శుక్రవారం (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి రానుంది.
స్టాంప్ డ్యూటీ విలువ లేదా ఒప్పందం విలువ ఏది ఎక్కువైతే దానిపైనే ఇది అమలవుతుంది.
అలాగే, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టోలు, ఎన్‌ఎఫ్‌టీలు) బదిలీలు, ట్రేడింగ్ లావాదేవీలపై 30 శాతం మూలధన లాభాల పన్ను అమల్లోకి రానుంది. ఈ మేరకు బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదనలు చేర్చడం తెలిసిందే.