తన చీర కట్టుకోబోయిన కోడలి గొంతు కోసి చంపిన అత్త | Mother-in-law murder daughter-in-law | Sakshi
Sakshi News home page

చీర వివాదం: కోడలి గొంతు కోసి చంపిన అత్త

Published Mon, May 19 2014 9:43 PM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

Mother-in-law murder daughter-in-law

 బెంగళూరు :  చీరకు సంబంధించిన వివాదం ఓ నిండు ప్రాణం తీసింది. చీర కట్టుకునే దగ్గర మాటా మాటా పెరిగి ఓ అత్త  కోడలి గొంతు కోసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన ఉడిపి జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కుందాపుర తాలూకా బైందూరు సమీపంలోని మొగలి గ్రామంలో అత్తా కోడళ్లు చంద్రావతి (55), నాగరత్న (30) నివాసముంటున్నారు. ఈ రోజు ఉదయం నాగరత్న భర్త పని మీద బయటకు వెళ్లాడు. ఆ సమయంలో నాగరత్న చంద్రావతి చీరను కట్టుకోడానికి యత్నించింది. అందుకు అత్త అభ్యంతరం చెప్పింది.  నాగరత్న వినలేదు.

దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన చంద్రావతి కోడలిని కిందకు పడేసి, ఆమెపై కూర్చొని కత్తితో గొంతు కోసేసింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో నాగరత్న క్షణాల్లో మరణిచింది. అనంతరం చంద్రావతి పారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న చంద్రావతి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement