
అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ వీరారెడ్డి
సంగారెడ్డిటౌన్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తనచాంబర్‌లో సివిల్ సప్లై అధికారులు, కాంట్రాక్టర్లు, రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ యాసంగిలో 2,07,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామన్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి శిక్షణ, గన్నీల ముందస్తు ఏర్పాట్లు, మిల్లులకు ధాన్యం కేటాయింపు, ధాన్యం నిల్వ ఏర్పాటుపై మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు.
యాసంగి ధాన్యంపై అదనపు కలెక్టర్ వీరారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment