
మంత్రి చేతులమీదుగా ప్రశంసపత్రాన్ని అందుకుంటున్న డాక్టర్ రఘు
పటాన్‌చెరు: లండన్‌కి చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో ప్రముఖ సామాజిక కార్యకర్త, బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు అరికపూడినకు చోటు లభించింది. శుక్రవారం మినిస్టర్స్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంస పత్రాన్ని, అవార్డ్‌ను అందుకున్నారు. 35 ఏళ్లుగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆ అవార్డు లభించింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడారు.
బీడీఎల్‌లో ఓ సామాన్య కార్మికుడిగా సేవలందిస్తూ దేశంలోని ఎన్నో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలను నిర్వహించానన్నారు. ఇప్పటి వరకు 18 వేల మంది నిరుపేదలకు సాయం అందించినట్లు తెలిపారు. తన సేవలను గుర్తించి అంతర్జాతీయ అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇది మరింత బాధ్యత పెంచిందన్నారు. తనకు సహాయ సహకారాలను అందించిన బీడీఎల్ ఉద్యోగులు, హోప్ ఫర్ స్పందన అభిష్టికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా సమన్వయకర్త డాక్టర్ బింగి నరేంద్రగౌడ్ పాల్గొన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment