
తోపుగొండలో గాయపడిన జింక
కంది(సంగారెడ్డి): వీధికుక్కల దాడిలో ఓ జింక తీవ్రంగా గాయపడింది. ఇంద్రకరణ్ ఎస్‌ఐ రాజేష్‌నాయక్ కథనం ప్రకారం...మండల పరిధిలోని తోపుగొండ సమీపంలో శుక్రవారం నీరు తాగేందుకు ఓ జింక వచ్చింది. వీధికుక్కలు ఒక్కసారి దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు కుక్కలను తరిమి అటవీఅధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన జింకను పశువైద్యశాలకు తరలించి అటవీఅధికారులు చికిత్స చేయించారు. గ్రామాల్లో వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వీధుల్లో చిన్నపిల్లలు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారని, కుక్కల బెడదను అరికట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment