
రాజు మృతదేహం
అపటాన్‌చెరుటౌన్: తన తమ్ముడిని చంపాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరు మండలం లకడారం గ్రామానికి చెందిన మ్యాగని రాజు(24) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మానసను వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవలే మానస పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మృతుడు రాజు తండ్రి కిష్టయ్య సంగారెడ్డి రాజంపేట ఇందిరా కాలనీకి చెందిన తన బావమరిది మల్లేశం కు ఫోన్ చేసి కోడలు మానసను తీసుకురమ్మని చెప్పాడు. దీంతో మల్లేశం తన బైక్‌పై మానస ఇంటికి గురువారం వెళ్లాడు.
అప్పటికే అక్కడ మాచర్ల శంకర్ తో పాటు మరికొంతమంది నీవు ఎందుకు వచ్చావని అతని పై దాడి చేశారు. ఈ ఏడాది జనవరి సంక్రాంతి పండగ సమయంలో తన సోదరుడు జగన్ అలియాస్ జోగన్నను రాజు తీసుకెళ్లి తాగించి చంపేశాడని శంకర్ అనుమానం పెంచుకొన్నాడు. మల్లేశంకు ఫోన్ చేసి రాజును పిలవాలని లేదంటే చంపేస్తానని శంకర్ బెదిరించాడు. దీంతో మల్లేశం రాజుకు ఫోన్ చేయించి శుక్రవారం తెల్లవారుజామున పిలిపించారు. అయితే రాజు రాగానే శంకర్‌తోపాటు మరి కొంతమంది చంపి శవాన్ని కుంటలో పడేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి మామ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment