
తెల్లాపూర్ మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయ నాయకులు
నారాయణఖేడ్: పాల ఉత్పత్తిని పెంచాలని విజయ డెయిరీ క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రవీణ్‌కుమార్ సూచించారు. మండలపరిధిలోని జూకల్ పాల శీతలీకరణ కేంద్రంలో శుక్రవారం ఖేడ్ డివిజన్ పరిధిలోని పశుపోషకులు, రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి హాజరైన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పశుపోషణ, అధికపాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలు, సొసైటీల ఏర్పాటు, నిర్వహణ, జిల్లాలో అమలవుతున్న డెయిరీ పథకాలు, గేదెల కొనుగోలుకు రుణాల మంజూరు విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నాణ్యమైన పాలు పోస్తున్న పశుపోషకులను సన్మానించారు. పశువైద్యాధికారి నేతాజీ, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ రాములు, ఖేడ్ ఎస్‌బీఐ మేనేజర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఎస్ యూటీఎఫ్ ఎంతో కృషి చేస్తుందని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ రామచంద్రాపురం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం ఉద్యమించే మాణిక్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, కోశాధికారి శ్రీనివాసరావు, నాయకులు ప్రభాకర్, ఏసు పాదం తదితరులు పాల్గొన్నారు.
మార్చి 12 వరకు ఆ రోడ్డు మూసివేత
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ఈద్గా వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 12వ తేదీ వరకు ఆ రోడ్డు మూసివేస్తున్నామని ఆర్‌అండ్‌బీ డీఈఈ నర్సింలు తెలిపారు. వాస్తవానికి శనివారంతో పనులు పూర్తి కావాల్సి ఉన్నా, ఇంకా క్యూరింగ్ పెండింగ్‌లోనే ఉంది. మిగిలిన పనులు పూర్తికావడానికి పదిహేనురోజుల వరకు పడుతుందన్నారు. అప్పటి వరకు జహీరాబాద్ పట్టణం నుంచి బీదర్ చౌరస్తా వైపు వెళ్లే ఫోర్‌వీలర్ వాహనాలను అల్గోల్ రోడ్డు గుండా రాకపోకలు సాగించాలన్నారు.

అవగాహన సదస్సుకు హాజరైనఅధికారులు, పశుపోషకులు
Comments
Please login to add a commentAdd a comment