
వీరారెడ్డిపల్లిలో కాలిపోయిన ట్రాక్టర్
దుబ్బాకటౌన్: సెల్ఫ్ మోటర్‌లో షార్ట్‌సర్క్యూట్ సంభవించి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ దగ్ధమైంది. ఈ సంఘటన రాయపోల్ మండలం వీరారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు కాసరాజు మూడేళ్ల క్రితం పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. గురువారం సాయంత్రం పొలం దున్ని చెట్టు క్రింద ట్రాక్టర్ నిలిపి పశువుల వద్దకు వెళ్లాడు. తిరిగి వచ్చి ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకెళ్దామని స్టార్ట్ చేయగా సెల్ఫ్ మోటర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో వాటిని ఆర్పేందుకు రాజు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్ మహబూబ్ తెలిపారు