
అవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలిస్తున్న అధికారులు
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ, మహ్మదాపూర్ గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులను శుక్రవారం సీఆర్డీ టెక్నికల్ బృందం పరిశీలించింది. జిల్లెలగడ్డలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, వైకుంఠధామాలు, మొక్కల పెంపకం పనుల నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు సంతోష్‌కుమార్, మమత తనిఖీ చేశారు. అలాగే మహ్మదాపూర్‌లో చెరువు పనులను పరిశీలించారు. అధికారుల వెంట ఏపీడీ ఓబులేశ్, ఎంపీడీఓ కుమారస్వామి, ఏపీఓ పద్మ, ఈసీ శ్రీనివాస్, సర్పంచ్‌లు లావుడ్య స్వరూప ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment