
మాట్లాడుతున్న చైర్మన్ బాదె చంద్రం
రామాయంపేట సహకార సంఘం
చైర్మన్ బాదె చంద్రం
రామాయంపేట(మెదక్): డైరెక్టర్ పదవి పోతుందనే భయంతోనే రామాయంపేట సహకార సంఘం డైరెక్టర్ దేవుని నర్సింహులు తమపై అవనసర ఆరోపణలు చేస్తున్నారని సంఘం చైర్మన్ బాదె చంద్రం ఆరోపించారు. శుక్రవారం సంఘం వైస్ చైర్మన్ సులోచన, డైరెక్టర్లు సుధాకర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రమావత్ లక్ష్మి, లద్ద నిర్మల, భాగ్యలక్ష్మితో కలిసి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేవుని నర్సింహులుకు ముగ్గురు సంతానం ఉండటంతో బచ్చురాజ్‌పల్లి నరేందర్ డీసీఓకు ఫిర్యాదు చేశారని, అధికారుల విచారణలో అది వాస్తవమేనని తేలిందన్నారు. తన డైరెక్టర్ పదవి పోతుందనే భయంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రూ.20 లక్షలు దుర్వినియోగమైనట్లు నర్సింహులు చేసిన ఆరోపణలు తప్పని, గోనె సంచులు కొనుగోలు చేసే అధికారం తమకు లేదని స్పష్టంచేశారు. ఏటా గోనె సంచులు సవిల్ సప్లయి కార్యాలయం నుంచి తమకు వస్తాయని, మిగిలిన సంచులు తాము అధికారులకు అప్పగించామన్నారు. నిధులు దుర్వినియోగానికి పాల్పడితే ఏశిక్షకై నా సిద్ధమేనని బాదె చంద్రం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment