అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది
ఫైర్ గ్యాస్‌తో మంటలు ఆర్పిన వైనం
మద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని హెచ్‌పి పెట్రొల్ బంక్‌లో డిజిల్ పోసుకుంటున్న టాటా ఏస్ వాహనం నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఫైర్‌గ్యాస్‌తో మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేబర్తి గ్రామానికి చెందిన టాటా ఏస్ ట్రాలీ వాహనం పత్తి లోడ్‌తో వచ్చింది. డీజిల్ నింపుతున్న క్రమంలో వాహనం కింది నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన నిర్వాహకులు వెంటనే మంటలు ఆర్పారు. మంటలను చూసినవారంతా పరుగులు తీశారు. అనంతరం బంక్ నిర్వాహకులు మాట్లాడుతూ పెట్రోల్ నింపే సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడకూడదని, ఆ క్రమంలోనే ప్రమాదం సంభవించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment