
మోహిన్ (ఫైల్)
మెదక్ మున్సిపాలిటీ: ఇంటి నుంచి వెళ్లిన యువకుడు చెరువులో చెరువులై శవమై కనిపించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణంలోని అజంపురా వీధికి చెందిన మహ్మద్ మోహిన్(24) ఈనెల 20వ తేదీన ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో అతడి కుటుంబీకులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పట్టణ శివారులోని గోసముద్రం చెరువులో ఓ గుర్తు తెలియని శవం తేలింది. గొర్రెల కాపరుల ద్వారా విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మహమ్మద్ మోహిన్ కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని మృతుడు ధరించిన దుస్తుల ఆధారంగా మహ్మద్ మోహిన్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.