
సాయిరాం మృతదేహం
వెల్దుర్తి (తూప్రాన్): మద్యం మత్తులో ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు. వివిద్యుదాఘాతంతో తీవ్రగాయాలై కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శంకరాజ్ కొండాపూర్ గ్రామానికి చెందిన యాట సాయిరాం (24) శుక్రవారం సాయంత్రం వెల్దుర్తి నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పులింగాపూర్ గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలతోపాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న సాయిరాం మద్యం మత్తులో హల్‌చల్ చేస్తూ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కాడు. గమనించిన పోలీసులు కిందకు దించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం యథావిధిగా తనిఖీలు చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత సాయిరాం మళ్లీ తిరిగొచ్చి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి తీగలు పట్టుకోవడతో విద్యుదాఘాతంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అయితే వాహనతనిఖీల సమయంలో సాయిరాం స్కూటీపై వచ్చాడా లేక రోడ్డు పక్కన నిలిపి పోలీసుల దగ్గరకు వచ్చాడా అన్నదానిపై స్పష్టత లేదు.
టవరెక్కడం..భయపెట్టడం
చిన్నశంకరంపేట(మెదక్): గత ఏడాది కూడా సాయిరాం ఇదే తరహాలో హల్‌చల్ చేశాడు. 2022 ఆగస్టు 27వ తేదీన సాయిరాం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ట్రిపుల్‌రైడ్ వెళుతున్నాడు. వాహన తనిఖీలో భాగంగా అతడి వాహనాన్ని ఆపినా, ఆగకుండా వెళ్లాడు. పోలీసులు వెంబడించడంతో బైక్ వదిలి విద్యుత్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. వెంటనే పోలీసులు విద్యుత్ అధికారులను అప్రమత్తం చేసి కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత సముదాయించి ఇంటికి పంపించారు.
విద్యుదాఘాతంతో
యువకుడికి తీవ్రగాయాలు
ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
పోలీసుల వాహన తనిఖీ
నేపథ్యంలో హల్‌చల్

చిన్నశంకరంపేటలో సాయిరాంను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment