CM KCR Launched Double Bedroom Houses Township In Sangareddy Kollur Village, Details Inside - Sakshi
Sakshi News home page

Kollur Housing Project: డబుల్‌ బెడ్‌రూమ్‌ టౌన్‌షిప్‌ ప్రారంభించిన కేసీఆర్‌.. స్పెషల్‌ ఇదే..

Published Thu, Jun 22 2023 12:05 PM | Last Updated on Thu, Jun 22 2023 1:08 PM

CM KCR Launched Double Bedroom Houses Township In Sangareddy Kollur - Sakshi

సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కొల్లూరులో కేసీఆర్‌ నగర్‌ పేరుతో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ టౌన్‌షిప్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. 

కాగా, సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ను నిర్మించింది. నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా కార్పొరేట్‌ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించారు.

ఈ టౌన్‌షిప్‌లో 145 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15,600 ఇళ్ల నిర్మాణం జరిగింది. సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించారు. G+9 నుంచి G+10, G+11 అంతస్తుల వరకు టౌన్‌షిప్‌ నిర్మాణం జరిగింది. మొత్తం 117 బ్లాక్‌లు, బ్లాక్‌కి 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. టౌన్‌షిప్‌లో మురుగునీటి శుద్ధి ప్లాంట్, స్కూల్స్, 118 వాణిజ్య దుకాణాల నిర్మాణం జరిగింది.

ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారి మౌనం వెనుక కారణం?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement