
సాక్షి, జిన్నారం(పటాన్‌చెరు): మైలాన్ రసాయన పరిశ్రమ యూనిట్–1లో రసాయనాలను వేరు చేస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఆదివారం జరిగింది.
కార్మికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రసాయనాలను వేరు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఒత్తిడి ఎక్కువై మెరుపులు వచ్చాయి. యాసిడ్ మాదిరి కాలే గుణం ఉన్న రసాయనాలు ఒక్కసారిగా బయటకు ఎగజిమ్మాయి. అవి వంటి మీద పడటంతో చర్మం కాలి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన వేర్‌హౌస్ అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్‌రావు (38), కార్మికులు వెస్ట్ బెంగాల్‌కు చెందిన పరితోష్ మెహతా (40), బిహార్‌కు చెందిన రంజిత్‌కుమార్ (27) అక్కడికక్కడే కాలిపోయారు. మంటలు కూడా చెలరేగినప్పటికీ సిబ్బంది వెంటనే స్పందించి ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment