కాంగ్రెస్‌తోనే పేదలకు మేలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే పేదలకు మేలు

Apr 15 2025 7:20 AM | Updated on Apr 15 2025 7:20 AM

కాంగ్

కాంగ్రెస్‌తోనే పేదలకు మేలు

మనోహరాబాద్‌(తూప్రాన్‌): కాంగ్రెస్‌తోనే పేదలకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రంగాయపల్లిలో పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. లింగారెడ్డిపేట, కాళ్లకల్‌లో దళితవాడల్లో పర్యటించి లబ్ధిదారుడు వర్గంటి యాదగిరి ఇంట్లో సన్నబియ్యం భోజనం చేశారు. ఆయన వెంట మాజీ వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ర్యాకల కృష్ణగౌడ్‌, పెంటాగౌడ్‌ ఉన్నారు.

వైఎస్సార్‌ బాటలోనే పాలన

శివ్వంపేట(నర్సాపూర్‌): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చూపిన బాటలో కాంగ్రెస్‌ పాలన కొనసాగుతుందని డీసీసీ అధ్య క్షుడు ఆంజనేయులుగౌడ్‌, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. సోమవారం జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చిన్నగొట్టిముక్ల నుంచి గోమారం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా గోమారంలో సన్నబియ్యం లబ్ధిదారుడు నాగరాజుయాదవ్‌ నివాసంలో భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని, ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వెంకట్రామిరెడ్డి, మాధవరెడ్డి, నవీన్‌గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వర జలం..

అన్నదాతల హర్షం

తూప్రాన్‌: మండలంలోని మల్కాపూర్‌ ఆదర్శ గ్రామంలో ప్రధాన చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నాయి. నెల రోజుల పాటు రైతులు తమ సొంత ఖర్చులతో కాళేశ్వరం జలాల కోసం సమష్టిగా చేసిన కృషి ఫలించడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. తొమ్మిది కిలోమీటర్ల మేర కాలువ పనులను రూ. 4 లక్షల వ్యయంతో చేయించారు. దీంతో చెరువులు నిండడంతో పాటు పంట పొలాలు ఎండిపోకుండా కాపాడుకున్నారు. మూడు చెరువులు అలుగు పారతుండడంతో సోమవారం శనిగచెరువు వద్ద వేద పండితులతో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

కనీస వేతనం ఇవ్వాలి:

సీఐటీయూ

మెదక్‌ కలెక్టరేట్‌: మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా మహాసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం రూ. 26,000 నిర్ణయించి, అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహాసభలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం కేవల్‌ కిషన్‌ భవన్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు సంతోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్‌, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి పద్మారావు, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లచ్చగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే పేదలకు మేలు 
1
1/2

కాంగ్రెస్‌తోనే పేదలకు మేలు

కాంగ్రెస్‌తోనే పేదలకు మేలు 
2
2/2

కాంగ్రెస్‌తోనే పేదలకు మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement