
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
హనుమాన్ నామస్మరణతో మెతుకుసీమ పుర వీధులు మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సాపూర్ రాయరావు చెరువు సమీపంలోని హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్,ఆయా పార్టీల నాయకులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం
శోభాయాత్రలో పాల్గొన్నారు. – నర్సాపూర్