
బియ్యం అమ్మితే రేషన్ కార్డు కట్
కలెక్టర్ రాహుల్‌రాజ్
నర్సాపూర్‌రూరల్/హవేళిఘణాపూర్(మెదక్): సన్న బియ్యం అమ్మితే లబ్ధిదారుల రేషన్ కార్డు కట్ చేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ చేస్తే అందరూ తినగలుగుతారని ఆలోచించి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. జిల్లావ్యాప్తంగా 2,13,820 తెల్ల రేషన్‌కార్డుదారులకు 4430.496 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్, మాజీ కౌన్సిలర్లు లలిత, సరిత, మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సుధాకర్, జైపాల్, నర్సింలు, స్వరూప, ఫహిం తదితరులు పాల్గొన్నారు. అలాగే హవేళిఘణాపూర్‌లో సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. కొందరు అంత్యోదయ కార్డు ద్వారా 30 కిలోల బియ్యం వచ్చేవని, ప్రస్తుతం రాకపోవడంతో పూట గడవడం కష్టంగా మారిందని కలెక్టర్‌తో మొరపెట్టుకున్నారు. దీంతో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.