ఉపాధి.. భవిష్యత్తుకు పునాది | - | Sakshi
Sakshi News home page

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది

Published Tue, Apr 15 2025 7:20 AM | Last Updated on Tue, Apr 15 2025 7:20 AM

ఉపాధి

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది

సంగారెడ్డిటౌన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు శిక్షణతోపాటు ఉపాధి కల్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది సంగారెడ్డిలోని గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారిని ఉన్నత స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో ఈ సంస్థ 2010లో జూన్‌ 7న ఏర్పాటు చేయగా నాటి నుంచి ఎస్బీఐ సౌజన్యంతో యువతీ, యువకులకు ఉపాధి కల్పించే అనేక రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. సంస్థ ద్వారా ఇప్పటివరకు 435 బ్యాచ్‌లకు శిక్షణ కల్పించి ఎంతోమంది ఉపాధికి బాటలు వేశారు. శిక్షణతోపాటు ఉచితంగా భోజనం, వసతి కల్పించడమే కాకుండా వ్యాపార రుణాలను సైతం మంజూరు చేస్తోంది. తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ అండగా నిలుస్తూ ఉపాధి కల్పిస్తుండడంతో ఈ శిక్షణ కేంద్రంపై నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. దీంతో రోజురోజుకు దీనికి ఎంతో ఆదరణ పెరుగుతుంది.

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు గత 15 ఏళ్లుగా మహిళలకు టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌, మగ్గంవర్క్‌, కంప్యూటర్‌ శిక్షణతోపాటు ఇటీవల ఉచిత కారు డ్రైవింగ్‌ శిక్షణ అందిస్తుండగా పురుషులకు మోటార్‌ వెహికల్‌ మెకానిక్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, సీసీ టీవీ, ఫొటోగ్రఫీ, కెమెరా ఇన్‌స్టాలేషన్‌ శిక్షణతోపాటు ఉచితంగా వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్‌ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో గ్రామీణ నిరుద్యోగ యువత శిక్షణ తీసుకునేందుకు తరలివస్తున్నారు.

సొంతంగా బైక్‌ మెకానిక్‌ షాపు పెట్టుకున్న

స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా బైక్‌ మెకానిక్‌లో శిక్షణ పొంది అనంతరం సొంతంగా గ్రామంలోనే మెకానిక్‌ షాప్‌ పెట్టుకుని ఉపాధి పొందుతున్నాను. నెలకు రూ.35 వేల వరకు సంపాదిస్తూ మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను.

– సురేశ్‌, మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామం

కుటుంబానికి ఆసరాగా నిలుస్తా

గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ద్వారా ఉచితంగా కుట్టు మెషీన్‌ శిక్షణ తీసుకుంటున్నాను. శిక్షణ అనంతరం ఎస్బీఐ ద్వారా రుణం పొంది సొంతంగా కుట్టు మెషీన్‌ ప్రారంభించి కుటుంబానికి ఆసరాగా ఉంటాను.

– అర్చన, మెదక్‌ జిల్లా, టేక్మాల్‌ మండలం, సూరంపల్లి

11,545 మందికి ఉచిత శిక్షణ

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణతోపాటు బ్యాంకు ద్వారా రుణాలను కల్పిస్తున్నాం. ఉచిత వసతితోపాటు వ్యాపారాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. శిక్షణ ఇవ్వడంతోపాటు సొంతంగా ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. ఇటువంటి అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.

– రాజేంద్రప్రసాద్‌,

గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్‌

బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తున్న

న్యూస్‌ పేపర్లో వచ్చిన ఉచిత శిక్షణ ప్రకటనను చూసి సంగారెడ్డి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాను. ఆ తర్వాత ఉచితంగా హాస్టల్లో ఉంటూ బ్యూటీషియన్లో శిక్షణ పొందాను. ప్రస్తుతం సంగారెడ్డి లో పార్లర్‌ నడుపుతున్నాను. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదిస్తున్నాను. మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాను.

– అశ్విని రాథోడ్‌, విట్టునాయక్‌ తండా, మొగుడంపల్లి మండలం

ఎస్‌బీఐ సౌజన్యంతో వ్యాపార రుణాలు

11,545 మందికి ఉచిత శిక్షణ

లబ్ధి పొందుతున్న నిరుద్యోగులు

30 రోజుల పాటు శిక్షణ

2010 జూన్‌ 7న ప్రారంభమైన ఈ శిక్షణ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 11,545 శిక్షణ తీసుకోగా అందులో 8,116 మంది స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. 3,303 మందికి బ్యాంకుల ద్వారా రుణాలను అందించారు. 834 మంది వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. శిక్షణలో భాగంగా వ్యక్తిత్వ వికాసం, వ్యాపార సంబంధ బ్యాంకింగ్‌ విషయాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత భోజనం, ఉచిత నివాసం ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తుంది. 30 రోజులపాటు ఈ శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేస్తారు.

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది1
1/5

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది2
2/5

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది3
3/5

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది4
4/5

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది5
5/5

ఉపాధి.. భవిష్యత్తుకు పునాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement