ప్రతి రికార్డు భద్రంగా ఉండాలి
కౌడిపల్లి(నర్సాపూర్)/రామాయంపేట(మెదక్): కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని శుక్రవారం జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ యువవికాసం దరఖాస్తుల గడువు ఈనెల 14 వరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు. దరఖాస్తులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వారీగా ప్రత్యేకంగా రిజిస్టర్‌లో నమోదు చేసి భద్రపర్చాలని తెలిపారు. ప్రతి రికార్డు భద్రంగా ఉండాలని సూచించారు. అనంతరం మండలంలో ఉపాధిహామీ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రంగాచారి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య


