కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Published Sat, Apr 5 2025 7:13 AM | Last Updated on Sat, Apr 5 2025 7:13 AM

కార్గ

కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి

పెద్దశంకరంపేట(మెదక్‌): ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఇసాఖ్‌ అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట బస్టాండ్‌లో కార్గో సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి తలంబ్రాలు, ము త్యాలను కార్గో ద్వారా ఇంటి వరకు అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 20 కార్గో సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్‌ శివశంకర్‌, రీజినల్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్రీనివాస్‌, పేట కార్గో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గోదాం మేనేజర్‌ సహా

మరో నలుగురు అరెస్ట్‌

మెదక్‌జోన్‌: జిల్లా కేంద్రంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించిన ముగ్గురు సిబ్బందితో పాటు వాహన డ్రైవర్‌, యజమానిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. గత 31వ తేదీన ఎలాంటి అనుమతి లేకుండా సీడబ్ల్యూసీ గోదాం నుంచి 35 క్వింటాళ్ల బియ్యాన్ని ఓ డీసీఎంలో పంపించారు. ఇదే విషయమై ఈనెల 2వ తేదీన సాక్షిలో ‘దొంగ చేతికి తాళం’ అనే కథనం ప్రచురితం కావడంతో డీసీఎం డ్రైవర్‌తో పాటు దాని యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. అయితే గోదాం మేనేజర్‌, మరో ఇద్దరు సిబ్బంది సహకారంతో బియ్యాన్ని తరలించామని వారు తెలిపారు. గతంలోనూ చాలా సార్లు బియ్యం ఇచ్చినట్లు పోలీసుల విచారణలో చెప్పారు. దీంతో డీసీఎం డ్రైవర్‌ చందర్‌, యజమాని సంతోష్‌తో పాటు మేనేజర్‌ కోటేశ్వర్‌రావు, టెక్నికల్‌ సిబ్బంది శ్యాం, సునీల్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.

7 నుంచి

లీగల్‌ లిటరసీ క్యాంపులు

నర్సాపూర్‌: ఈనెల 7వ తేదీ నుంచి మండలంలో లీగల్‌ లిటరసీ క్యాంపులు నిర్వహించనున్నట్లు మెదక్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ సిరి సౌజన్య తెలిపారు. నారాయణపూర్‌లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఈనెల 7, నర్సాపూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8, 9న మండలంలోని రెడ్డిపల్లి ఇందిర క్రాంతిపథం గ్రూపు మహిళల కోసం క్యాంపులు నిర్వహిస్తామని ఆమె చెప్పారు.

ఆన్‌లైన్‌లో కొత్త

పంచాయతీల వివరాలు

డీపీఓ యాదయ్య

కౌడిపల్లి(నర్సాపూర్‌): కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల వివరాలను ఆన్‌లైన్‌లో త్వరగా నమోదు చేయాలని డీపీఓ యాదయ్య కంప్యూటర్‌ ఆపరేటర్లను ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో కొత్త గ్రామ పంచాయతీల ఆన్‌లైన్‌ వివరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 24 గ్రామ పంచాయతీలు ఏర్పాటైనట్లు తెలిపారు. కాగా పాత పంచాయతీల నుంచి గ్రామ పంచాయతీలకు ఇండ్లు, ఇతర ప్రభుత్వ ప్రదేశాలను వేరుచేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు. కౌడిపల్లి మండలంలో ఆరు పంచాయతీలు కొత్తగా ఏర్పాటైనట్లు వివరించారు. నాలుగు పంచాయతీలలో ఆన్‌లైన్‌ పూర్తి అయిందని, మిగితా రెండు పంచాయతీల వివరాలు సైతం త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

కార్గో సేవలను  సద్వినియోగం చేసుకోవాలి 
1
1/2

కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి

కార్గో సేవలను  సద్వినియోగం చేసుకోవాలి 
2
2/2

కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement