
వన్యప్రాణుల దాహం దాహం
తొనిగండ్ల అటవీ ప్రాంతంలో నీరు లేక ఎండిపోయిన కుంట
● నీటి కోసం పంట చేన్లు, గ్రామాల్లోకి వన్యప్రాణులు
● తాజాగా లక్ష్మాపూర్ వద్ద జింకను హతమార్చిన కుక్కలు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
రామాయంపేట రేంజ్ పరిధిలోని వన్యప్రాణులకు తాగు నీరు అందించడానికి కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో పంచాయతీ వారి సహకారంతో ట్రాక్టర్లలో నీరు నింపుకొని సాసర్‌పిట్లలో పోస్తున్నాం. నీటి ఎద్దడి విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – విద్యాసాగర్,
రామాయంపేట రేంజ్ అధికారి
రామాయంపేట(మెదక్): వన్యప్రాణులు తాగు నీటి కోసం అల్లాడుతున్నాయి. నీటి కోసం వ్యవసాయ బోర్లు, గ్రామాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. తాజాగా శుక్రవారం అటవీ ప్రాంతం నుంచి లక్ష్మాపూర్ గ్రామంలోకి వచ్చిన జింకపై కుక్కలు దాడి చేసి హతమార్చాయి. రామాయంపేట, చేగుంట మండలాల్లో దట్టమైన అటవీప్రాంతం విస్తరించి ఉంది. రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగు నీటి వసతి కల్పనకు గాను 105 సాసర్‌పిట్లతో పాటు 15 చెక్‌డ్యాంలు, 27 చిన్నస్థాయి కుంటలున్నాయి. ఏటా వేసవిలో సాసర్‌పిట్లలో నీరు నింపి వన్యప్రాణుల దాహర్తి తీరుస్తున్నారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆశాఖ అధికారులు నీటి సదుపాయం కల్పించలేకపోతున్నారు. ప్రస్తుతం కొన్ని సాసర్‌పిట్లు పాక్షికంగా ధ్వంసం కాగా రేంజ్ పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో మాత్రం ఆశాఖ అధికారులు పంచాయతీ ట్రాక్టర్‌తో సాసర్‌పిట్లలో నీరు పోయిస్తున్నారు. అటవీ ప్రాంతంలో చిరుతలతో పాటు జింకలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, రేసుకుక్కలు, మనుబోతులు, ఇతర జంతువులు ఉన్నాయి. రాయిన్‌పల్లి చెరువు అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండటంతో రాత్రివేళ పదుల సంఖ్యలో జంతువులు చెరువు వద్దకు వెళ్లి తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

వన్యప్రాణుల దాహం దాహం

వన్యప్రాణుల దాహం దాహం