
యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి
చిన్నశంకరంపేట(మెదక్)/వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం చేయూత అందించేందుకు తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం యువత సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య కోరారు. బుధవారం చిన్నశంకరంపేట, మాసాయిపేట మండల పరిషత్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు చేసిన ప్రతీ ఒక్కరూ హర్డ్ కాపీని తీసుకొచ్చి ఎంపీడీఓ కార్యాయలంలో అందించాలన్నారు. ఎంపీడీఓ కార్యాలయ రికార్డులు, ఈజీఎస్ సోషల్ ఆడిట్ రికార్డులు పరిశీలించి, ఉపాధిహామీ పనులపై ఆరా తీశారు.
నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు
వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఆదేశించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, తాగునీటి సమస్యలపై పలు సలహాలు, సూచనలు అందజేశారు. నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ విఘ్నేశ్వర్ తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల జాబితా పరిశీలన
చేగుంట(తూప్రాన్): మండలంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారుల జాబితాను జెడ్పీ సీఈఓ ఎల్లయ్య బుధవారం పరిశీలించారు. చేగుంట ఎంపీడీఓ కార్యాలయం సందర్శించిన జెడ్పీ సీఈఓ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాతో పాటు ఉపాధి కూలీల సామాజిక తనిఖీ రిపోర్టును పరిశీలించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు యాక్షన్ ప్లాన్ ప్రకారం పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ చిన్నారెడ్డికి సూచించారు. ఈ పరిశీలనలో ఉపాధి హామీ ఏపీఓ స్వేత, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య