
కేతకీ ఆలయాభివృద్ధికి కృషి
● ఎంపీ సురేశ్ షెట్కార్ ● నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం
ఝరాసంగం(జహీరాబాద్): కేతకీ సంగమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ హామీనిచ్చారు. నూతనంగా ఏర్పాటైన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఆలయంలో నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయన గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ...ఆలయానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి పాటుపడతానన్నారు. అభివృద్ధి జరిగితేనే మరింతగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, సునీతా పాటిల్ తదితరులు పాల్గొన్నారు.