
చంద్రశేఖర్‌కు డాక్టరేట్
తూప్రాన్: పట్టణానికి చెందిన గౌడేల్లి రాములు, యశోద దంపతుల రెండవ కుమారుడు చంద్రశేఖర్ పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా సాధించాడు. ఆధునిక నావిగేషన్ ఎలక్ట్రానిక్స్‌లో పరిశోధన కొనసాగించి, ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అత్యున్నత డిగ్రీ అయినా పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టాను పొందాడు. పరిశోధనకు సహకరించిన ప్రొఫెసర్లు, ఉద్యమకారులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ కలువగా ఆమె ప్రశంసించారు.