
మహనీయుడు జగ్జీవన్‌రామ్
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: నేటి యువతకు బాబు జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కలెక్టర్ రాహుల్‌రాజ్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జగ్జీవన్‌రామ్ జయంతిని నిర్వహించగా.. కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ చిలుముల సుహాసినిరెడ్డి జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యంతకాలం కేబినేట్ మంత్రిగా కొనసాగిన ఘనత అయనకే దక్కిందన్నారు. రక్షణ మంత్రిగా ఇండో–పాక్ యుద్ధ సమయంలో దేశానికి విజయాన్ని సాధించిపెట్టడంలో ఆయన పాత్ర కీలకం అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని తెలిపారు. జిల్లాలో అంబేడ్కర్ భవన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లతో విద్యలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ భుజంగరావు, ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ. టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, కార్యదర్శి రాజ్‌కుమార్, వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో జగ్జీవన్‌రామ్ జయంతిని నిర్వహించారు.
ఎస్పీ కార్యాలయంలో..
మెదక్ మున్సిపాలిటీ: బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగానాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

మహనీయుడు జగ్జీవన్‌రామ్