
పక్షం రోజుల్లో అందరికీ రైతుభరోసా
కంగ్టి(నారాయణఖేడ్): పక్షం రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ స్పష్టం చేశారు. కంగ్టి మండలంలోని తడ్కల్ రైతు వేదికలో కంగ్టి ప్యాక్స్ చైర్మన్ మారుతిరెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. రూ. 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ...తడ్కల్ మండలం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తే తడ్కల్‌లో ప్రా థమిక వ్యవసాయ పరపతి సంఘం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రేషన్‌లో సన్నబియ్యం ఉచితంగా ఇస్తూన్నా నూకలు ఇచ్చారని సోషల్ మీ డియాలో బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దామ నాగన్న, పార్టీ మండల అధ్యక్షుడు మల్‌రెడ్డి, ఏఓ హరీశ్‌పవార్, నాయకులు డాక్టర్ హమీద్, మల్లారెడ్డి, బాబుసాబ్, ప్యాక్స్ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ ఎంపీ
సురేశ్ కుమార్ షెట్కార్