
ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం
కొల్చారం(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఆరు గంటల లోపు అన్‌లోడింగ్ చేయాలని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రైస్ మిల్లర్ల యజమానులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లును సందర్శించారు. ధాన్యం అన్‌లోడింగ్‌పై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిల్లులకు వచ్చే ధాన్యాన్ని వెనువెంటనే అన్‌లోడింగ్ చేయడం వల్ల రైతులకు ఇబ్బందులుండన్నారు. స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. తహసీల్దార్ గఫార్ మియా, ఆర్‌ఐ ప్రభాకర్ ఉన్నారు.