
దరఖాస్తులు సత్వరమే పరిష్కారం
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణిలో ప్రజలిచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఆయనతో పాటు డీఈఓ రాధాకిషన్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేయాలన్నారు. ప్రజావాణిలో పలు సమస్యలపై 58 దరఖాస్తులు సమర్పించారని, ఇందులో అత్యధికంగా భూ సమస్యలపై వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో కునుకు తీసిన అధికారి..
ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన జిల్లాస్థాయి అధికారులు తోటి అధికారులతో ముచ్చట్లలో మునిగిపోయారు. ఒక అధికారి మాత్రం గాఢనిద్రలోకి వెళ్లడం గమనార్హం. అధికారి నిద్ర పోవ డం చూసి ప్రజా సమస్యలపై అధికారుల పనితీరు ఇంతేనంటూ పలువురు విమర్శించారు.
ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నగేశ్