ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
పెద్దశంకరంపేట(మెదక్): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం అన్నారు. గురువారం మండలంలోని దానంపల్లిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి 38 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 5 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. మిగితా వారు కూడా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఏఈ విద్యాసాగర్, ఎంపీఓ విఠల్‌రెడ్డికి సూచించారు. అన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, వాటికి వెంటవెంటనే బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మధు, నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, పెరుమాండ్లుగౌడ్, పంచాయతీ సెక్రటరీ నరేందర్ పాల్గొన్నారు.
జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం


