
రైతులను ఆదుకోండి
సిద్దిపేటజోన్: పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. గురువారం కలెక్టర్ మనుచౌదరి, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, వరి, మామిడి పంట లను అకాల వర్షం తీవ్రంగా నష్టపరిచిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సూ చించారు. నష్టపోయిన రైతులకు రూ. 20 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.