
బెట్టింగ్ యాప్‌లతో జర భద్రం
డీఎస్పీ ప్రసన్నకుమార్
పాపన్నపేట(మెదక్): మొబైల్ యాప్‌లలో వచ్చే ప్రకటనలు నమ్మి, బెట్టింగ్‌లు పెట్టి ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు తీసుకోవద్దని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి సూచించారు. బుధవారం పాపన్నపేటలో సెల్ ఫోన్‌లు పోగొట్టుకున్న 22 మంది బాధితులకు వాటిని రివకరీ చేసి అప్పగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా చోరీకి గురైన ఫోన్‌లను గుర్తించామన్నారు. మొబైల్ ఫోన్ చోరీకి గురి కాగానే బాధితులు వెంటనే తమ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఐఎంఈఐ నంబర్‌ను భద్రపర్చుకోవాలన్నారు. రాష్ట్రంలో మొబైల్ ఫోన్‌ల రికవరీలో మెదక్ జిల్లా ముందంజలో ఉందని వివరించారు. ఈసందర్భంగా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ఏఎస్‌ఐ సంగన్న, గాలయ్య, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్‌ను అభినందించారు.
02ఎన్‌ఆర్‌ఎస్62ఎ: భక్తుల బోనాల ఊరేగింపు