
కార్యకర్తలకు అండగా ఉంటా
నర్సాపూర్: కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె పుట్టిన రోజును పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి రాగానే ఆదరించి, వరుసగా మూడుసార్లు గెలిపించారని, ప్రతిపక్షంలో ఉన్నా తన వెన్నంటి ఉంటున్న కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చా రు. తనను నిరంతరం ఆదరిస్తున్న ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అక్రమ కేసులకు భయపడవద్దని, అండగా నేనున్నానని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఆయా పథకాలే బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొ స్తాయని జోస్యం చెప్పారు.
శనేశ్వరాలయంలో
ప్రత్యేక పూజలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెల్మకన్న శనేశ్వరాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ పూజారులు శనేశ్వరునికి పూ జలు చేసి తైలాభిషేకం చేశారు. వివిధ గ్రా మాల నుంచి తరలివచ్చిన భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
సన్నబియ్యం.. నూకలే అధికం
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా సరఫరా చేస్తున్న సన్నబియ్యంలో ఎక్కువగా నూకలే వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. అయితే గతంలో కంటే భిన్నంగా ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. మండల కేంద్రమైన కౌడిపల్లిలో రెండు షాపుల్లో శుక్రవారం రాత్రి నుంచి లబ్ధిదారులకు రేషన్‌కార్డుపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే బియ్యం బాగున్నాయని.. 24 కిలోల బియ్యంలో 5 కిలోలకుపైగా నూకలు వచ్చాయని వాపోయారు. నూకలు లేకుండా సన్నబియ్యం పంపిణీ చేస్తే మరింత బాగుంటుందని కోరుతున్నారు.
జూన్‌లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
నంగునూరు(సిద్దిపేట): అత్యాధునిక టెక్నాలజీతో నంగునూరు మండలం నర్మేటలో నిర్మి స్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని జూన్‌లో ప్రారంభిస్తామని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు, ఎల్లాయిగూడ, రంగ నాయకసాగర్‌లోని ఆయిల్‌పామ్ నర్సరీల స్థితిగతులను, పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. సిద్దిపేట, జనగామ జిల్లాల వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో సాగు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని సందర్శించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన ఆయిల్ గెలలను పరిశీలించి వారితో మాట్లాడారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న నిర్మా ణం పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుకు జనగామ, సిద్దిపేట జిల్లాలోని భూము లు అనువుగా ఉన్నాయని, పెద్ద ఎత్తున సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా

కార్యకర్తలకు అండగా ఉంటా

కార్యకర్తలకు అండగా ఉంటా