రైతులను ఇబ్బంది పెట్టొద్దు
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
చేగుంట(తూప్రాన్): రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వడియారం, అనంతసాగర్, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో వెంటనే నమోదు చేసి సకాలంలో రైతులకు ధాన్యం డబ్బులు వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం రుక్మాపూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొన్నారు. అలాగే కసాన్‌పల్లి దౌల్తాబాద్ మండలం మాచిన్‌పల్లి సరిహద్దులోని రామాయంపేట కెనాల్‌ను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఉప కాల్వలు పూర్తి చేయించి చెరువుల్లో నీరు నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఎంపీడీఓ చిన్నారెడ్డి, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి నాయకులు పాల్గొన్నారు.


