పరీక్షలు ముగిశాయోచ్
పాపన్నపేట(మెదక్): విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 21వ తేదీన ప్రారంభమైన పరీక్షలు సాంఘీక శాస్త్రం పరీక్షతో పరిసమాప్తమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 10,388 మంది విద్యార్థులకు 10,241 మంది పరీక్షలు రాశారు. 147 మంది వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు. చివరి పరీక్ష రాసి కేంద్రాల్లో నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు ఆనందంగా కన్పించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ పర్యవేక్షణలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు.
పరీక్షలు ముగిశాయోచ్


