
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థంలో ముఖ్యమంత్రి రేవంత్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలో బుధవారం జరిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి–గుణచైతన్యరెడ్డి నిశ్చితార్థ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. జపాన్ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సంగారెడ్డికి చేరుకున్న రేవంత్‌రెడ్డి ముందుగా రాంనగర్‌లో ఉన్న రామాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిశ్చితార్థ కార్యక్రమానికి చేరుకుని కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డితోపాటు, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.